‘అందుకే చైతూ సినిమా పక్కన పెట్టేశాం’

Indraganti Mohan Krishna About Movie With Naga Chaitanya - Sakshi

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌ లాంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్‌ ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇటీవల జెంటిల్‌మన్‌ సినిమాతో తన కెరీర్‌లోనూ బిగెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్నారు. తరువాత అమీతుమీ సినిమాతో మరో మంచి విజయం అందుకున్న మోహనకృష్ణ ప్రస్తుతం సుధీర్‌ బాబు హీరోగా సమ్మోహనం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకన్నా ముందే నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించాల్సి ఉన్నా ఆ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చలేదు.

జెంటిల్‌మన్‌ సక్సెస్‌ తరువాత మోహనకృష్ణ దర్శకత్వంలో నటించేందుకు స్టార్‌ హీరోలు కూడా ఆసక్తి కనబరిచారు. సాయి కొర్రపాటి నిర్మాతగా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను ప్రకటించారు. అయితే పూర్తి యాక్షన్ కథాంశంగా కావటంతో అప్పటికే నాగచైతన్య యాక్షన్‌ జానర్‌లో సవ్యసాచి సినిమాకు ఓకె చెప్పటంతో మోహనకృష్ణ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారట. ఈ విషయాన్ని సమ్మోహనం ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు వెల్లడించారు. త్వరలోనే మరో మంచి కథతో నాగచైతన్య హీరోగా సినిమా చేస్తానని చెప్పారు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్‌ బాబు, అదితిరావు హైదరీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సమ్మోహనం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top