త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం | Illayaraja's son to launch fan club for father | Sakshi
Sakshi News home page

త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం

Mar 17 2014 3:27 PM | Updated on Sep 2 2017 4:49 AM

త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం

త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా త్వరలోనే తన తండ్రి పేరుమీద ఓ అభిమాన సంఘం ఏర్పాటుచేయబోతున్నాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా త్వరలోనే తన తండ్రి పేరుమీద ఓ అభిమాన సంఘం ఏర్పాటుచేయబోతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సంఘం ఏర్పాటుకానుంది. ఇళయరాజా విశేషాలతో కూడిన ఓ వారపత్రిక తీసుకురావడంతో పాటు సామాజిక కార్యకలాపాలలో కూడా ఈ సంఘం పాల్గొంటుంది. ఇది ఇతర నటీనటుల అభిమాన సంఘాల్లా ఉండబోదని, విభిన్నంగా ఉంటుందని కార్తీక్ చెప్పాడు.

ఆ కళాకారుడి ద్వారా అభిమానులకు చేరువ కావడమే అభిమాన సంఘాల ఉద్దేశం అవుతుందని, దాన్ని తాము సాధిస్తామని అన్నాడు. 'ఇసైజ్ఞాని' అనే పేరుతో వారపత్రికను తీసుకొస్తున్నట్లు తెలిపాడు. ఇందులో ఇళయరాజా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, ఇతర విషయాలు అన్నీ ఉంటాయి. ఇళయరాజా వారసుడిగా సంగీత దర్శకత్వంలోకి అడుగుపెట్టిన కార్తీక్, ఇప్పటికి దక్షిణాదిలోని పలు భాషల్లో 50 సినిమాలకు సంగీతం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement