breaking news
isaignani
-
ఇళయరాజాకు తొలి సెల్యూట్
చెన్నై : సంగీత రారాజు ఇళయరాజాకు తొలి సెల్యూట్ చేసే కార్యక్రమం శనివారం చెన్నైలో జరగనుంది. సహస్ర చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు బహుశ భారతదేశంలోనే ఇసైజ్ఞాని ఇళయరాజా ఒక్కరే అయ్యి ఉంటారు. ఇది ఒక చరిత్ర అని పేర్కొనవచ్చు. అలాంటి సంగీతరాజాకు సెల్యూట్ చెప్పే విధంగా వంద మంది ప్రముఖ చిత్ర కళాకారులు ఆయన సంగీతం నోట్స్‌కు రూపం ఇస్తూ గీసిన చిత్రలేఖనాల ప్రదర్శన కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక నుంగమ్‌బాక్కమ్‌లోని లయోలా కళాశాలలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఇళయరాజాతో పాటు నటుడు విజయ్‌సేతుపతి, నడిగర్‌సంఘం అధ్యక్షుడు నాజర్, పొన్వన్నన్, దర్శకుడు ఎస్పీ జననాథన్,కదిర్, పా.రంజిత్ పాల్గొననున్నారు. -
త్వరలో ఇళయరాజా అభిమాన సంఘం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా త్వరలోనే తన తండ్రి పేరుమీద ఓ అభిమాన సంఘం ఏర్పాటుచేయబోతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సంఘం ఏర్పాటుకానుంది. ఇళయరాజా విశేషాలతో కూడిన ఓ వారపత్రిక తీసుకురావడంతో పాటు సామాజిక కార్యకలాపాలలో కూడా ఈ సంఘం పాల్గొంటుంది. ఇది ఇతర నటీనటుల అభిమాన సంఘాల్లా ఉండబోదని, విభిన్నంగా ఉంటుందని కార్తీక్ చెప్పాడు. ఆ కళాకారుడి ద్వారా అభిమానులకు చేరువ కావడమే అభిమాన సంఘాల ఉద్దేశం అవుతుందని, దాన్ని తాము సాధిస్తామని అన్నాడు. 'ఇసైజ్ఞాని' అనే పేరుతో వారపత్రికను తీసుకొస్తున్నట్లు తెలిపాడు. ఇందులో ఇళయరాజా ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, ఇతర విషయాలు అన్నీ ఉంటాయి. ఇళయరాజా వారసుడిగా సంగీత దర్శకత్వంలోకి అడుగుపెట్టిన కార్తీక్, ఇప్పటికి దక్షిణాదిలోని పలు భాషల్లో 50 సినిమాలకు సంగీతం అందించాడు.