
సైఫ్ అలీఖాన్, సారా అలీఖాన్
‘‘పనికోసం వచ్చే అమ్మాయిలను తమ పలుకుబడి ఉపయోగించి తప్పుగా ప్రవర్తించడం చాలా దారుణం’’ అన్నారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. పని ప్రదేశాల్లో వేధింపుల గురించి సైఫ్ మాట్లాడుతూ– ‘‘వాళ్లకు రక్షణగా ఎవరూ లేరని అసభ్యంగా ప్రవర్తించడం తప్పు. ఒకవేళ నా కూతుర్ని (సారా అలీఖాన్) ఎవరైనా అక్కడికి వచ్చి కలువు.. ఇక్కడికి రా.. అని అడిగితే నేనూ తనతో కలిసి వెళ్లి వాళ్ల మొహం మీద ఒక్క పంచ్ ఇస్తా.
ఎవరైనా తనని ఏదైనా అన్నా కూడా వాళ్లు నన్ను కోర్ట్‌లో కలవాల్సి ఉంటుంది. తప్పదు, కానీ నా రియాక్షన్ ఇలానే ఉంటుంది. అలా చేస్తేనే మళ్లీ అలా చేయకుండా ఉంటారు. ప్రతి అమ్మాయికీ ఇలాంటి రక్షణ ఉండాలని కోరుకుంటా’’ అని పేర్కొన్నారు. ఇక సినిమా విషయానికొస్తే.. సారా అలీఖాన్ ప్రస్తుతం ‘టెంపర్’ హిందీ రీమేక్ ‘సింబా’ షూటింగ్ కోసం స్విట్జర్‌ల్యాండ్‌లో ఉన్నారు. అజయ్ దేవగన్ హీరోగా చేయనున్న ‘తానాజీ’లో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపిస్తారట. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘సాక్రెడ్ గేమ్స్’ సీజన్ 2 షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నారు సైఫ్.