‘నేను కోలుకోలేని వార్త’ | 'I Can not Receive News' | Sakshi
Sakshi News home page

‘నేను కోలుకోలేని వార్త’

Feb 25 2018 11:41 AM | Updated on Feb 25 2018 11:41 AM

'I Can not Receive News' - Sakshi

సీనియర్‌ నటి ఊర్వశి శారద

చెన్నై: నటి శ్రీదేవి మరణం వ్యక్తిగతంగా తాను కోలుకోలేని వార్త అని సీనియర్‌ నటి శారద అన్నారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ..ఈ షాక్ తాను తట్టుకోలేక పోతున్నానని చెప్పింది. పప్పి అని పిలుచుకునే శ్రీదేవితో తన అనుబంధం మాటలతో చెప్పలేనిదని వర్ణించారు. ఆమె లేదు అనే నిజాన్ని మనస్సు ఇప్పటికీ అంగీకరించలేకపోతుందని అన్నారు. ఆమె నిగర్వి అని వ్యాఖ్యానించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్రీదేవి కుటుంబానికి తన ప్రగాడ సానుభూతి  తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రపంచం గొప్ప నటిని కోల్పోయిందని, ఆమెతో సినిమా చేయలేని సీనియర్ నిర్మాతగా బాధపడుతున్నానని  నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. ఆమె అందమైనదేకాదు ఆమె మనస్సు అంతకంటే అందమైనదని వర్ణించారు.

Advertisement
 
Advertisement
Advertisement