వాళ్ల అంతు చూస్తా

'I Am A Rajput, And Will Destroy Them' Says Kangana Ranaut - Sakshi

‘మణికర్ణిక’ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఓ వివాదం నడుస్తోంది. దర్శకులు మారడం.. నటుడు సోనూసూద్‌ తప్పుకోవడం.. తాజాగా సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ కర్ణిసేన నిరసన తెలియజేస్తున్నారు. ఈ విషయంపై కంగనా రనౌత్‌ స్పందిస్తూ– ‘‘మా సినిమాను నలుగురు చరిత్రకారులు చూసి సర్టిఫై చేశారు. సెన్సార్‌ బృందం కూడా చూసింది. కర్ణిసేనకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. ఇంకా మా సినిమా మీద అనవసరమైన వివాదాన్ని సృష్టిస్తున్నారు వాళ్లు. ఆ పనులు ఆపకపోతే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నేనూ రాజ్‌పుత్‌నే.. వాళ్ల అంతు చూస్తాను’’ అని ఘాటుగా పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top