నైట్ పార్టీలకు వెళ్లను | i am not attended night Partys : Priya Anand | Sakshi
Sakshi News home page

నైట్ పార్టీలకు వెళ్లను

Jan 31 2014 2:50 AM | Updated on Aug 28 2018 4:30 PM

నైట్ పార్టీలకు వెళ్లను - Sakshi

నైట్ పార్టీలకు వెళ్లను

నైట్ పార్టీలకు వెళ్లే అలవాటు లేదు. ప్రేమకు పచ్చజెండా ఊపను వంటి ప్రకటనలు గుప్పిస్తోంది నటి ప్రియా ఆనంద్. తొలి రోజుల్లో వామనన్,

  నైట్ పార్టీలకు వెళ్లే అలవాటు లేదు. ప్రేమకు పచ్చజెండా ఊపను వంటి ప్రకటనలు గుప్పిస్తోంది నటి ప్రియా ఆనంద్. తొలి రోజుల్లో వామనన్, నూట్రెంబదు చిత్రాల్లో నటించి ఐరన్ లెగ్ ముద్రకు గురైన ఈ బ్యూటీ ఆ తరువాత నటించిన ఇంగ్లిష్ వింగ్ల్లిష్, ఎదిర్ నీచ్చల్, వణక్కం చెన్నై వంటి చిత్రాల విజయాలతో ప్రైమ్ టైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అరిమానంబి, వై రాజా వై, ఇరుంబు కదిరై, ఒరు ఊరుల రెండు రాజా తదితర ఐదు చిత్రాలు ఉన్నాయి. ప్రియా ఆనంద్ మాట్లాడుతూ నటి శ్రీదేవితో కలసి నటించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రం తన కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యువ నటుడు గౌతమ్ కార్తీక్ తనకు నచ్చిన నటుడని బదులిచ్చింది. అలాగే తాను జత కడుతున్న హీరోల్లో అధికశాతం పెళ్లి అయిన వారేనని అంది. తాను నైట్ పార్టీలకు వెళ్లింది లేదని ఎవరినీ ప్రేమించింది లేదని చెప్పింది. తనకు వరుడిని తెచ్చిపెట్టే బాధ్యతను తన తల్లిదండ్రులకు అప్పగించానని ప్రియా ఆనంద్ చెప్పడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement