ఎంత డబ్బిచ్చినా అది మాత్రం చేయను! | I am not act in Fairness cream ads says Tamanna | Sakshi
Sakshi News home page

ఎంత డబ్బిచ్చినా అది మాత్రం చేయను!

Sep 20 2015 12:24 AM | Updated on Sep 3 2017 9:38 AM

ఎంత డబ్బిచ్చినా అది మాత్రం చేయను!

ఎంత డబ్బిచ్చినా అది మాత్రం చేయను!

చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవా అనే రీతిలో క్రేజ్ ఉన్నవాళ్లు క్యాష్ చేసుకున్నంత అన్నట్లుగా సెలబ్రిటీల లైఫ్ ఉంటుంది.

 చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవా అనే రీతిలో క్రేజ్ ఉన్నవాళ్లు క్యాష్ చేసుకున్నంత అన్నట్లుగా సెలబ్రిటీల లైఫ్ ఉంటుంది. జనాల్లోకి తమ ఉత్పత్తిని తీసుకెళ్లడం కోసం ఉత్పత్తిదారులు సెలబ్రిటీలతో నాలుగు మంచి మాటలు చెప్పిస్తారు. ఈ మాటలు చెప్పడానికి సెలబ్రిటీలు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారు. స్టార్ హీరోయిన్ తమన్నా కూడా అలా భారీ పారితోషికం తీసుకుని, చేస్తున్న వాణిజ్య ప్రకటనలు చాలానే ఉన్నాయి. కానీ, ఈ మిల్కీ బ్యూటీ ఎన్ని కోట్లిచ్చినా ఒకే ఒక్క యాడ్‌లో మాత్రం నటించరట.
 
 గతంలో అలాంటి యాడ్‌లో నటించిన తమన్నా ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నారు. దాని గురించి ఆమె చెబుతూ - ‘‘సినిమాల్లోకి రాకముందు నేను మోడల్‌గా చేసేదాన్ని. ఆ సమయంలో ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో నటించాను. కానీ, ఇప్పుడు నేను హీరోయిన్‌ని. ఓ సెలబ్రిటీగా సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది. అందుకే, శరీర రంగుకి సంబంధించిన ఉత్పత్తులకు మోడల్‌గా చేయకూడదని నిర్ణయించుకున్నాను. మన ఇండియాలో రంగుకి ప్రాధాన్యం ఇస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే, రంగు అనేది మన చేతుల్లో ఉండదు. కానీ, ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే, శారీరకంగా తెల్లగా ఉండాలనుకోకుండా మానసికంగా తెల్లని కాగితంలా ఉండాలంటాను’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement