ఒక్క సెట్‌కు ఆరు కోట్లు!

Huge Football Stadium Set For Vijay And Atlee Movie - Sakshi

వరుస విజయాలతో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్‌ 63వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ షూటింగ్ పూర్తి చేసుకుంది. కీలకమైన మూడో షెడ్యూల్‌ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను రెడీ చేస్తున్నారు. గతంలో విజయ్‌, అట్లీ కాంబినేషన్‌లో రూపొందిన తేరి, మెర్సల్‌ సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీగా ఖర్చు పెడుతున్నారు.

క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నాడు. తదుపరి షెడ్యూల్‌లో గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 50 రోజుల పాటు షూటింగ్ నిర్వహించాల్సి ఉండటంతో ఫుట్‌బాల్‌ స్టేడియం సెట్‌ను రెడీ చేస్తున్నారు. కేవలం ఈ సెట్‌ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఏజీయస్‌ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్‌ రెహమాన్ సంగీతమందిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top