పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు | Hrithik takes an auto ride with his sons! | Sakshi
Sakshi News home page

పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు

Jan 4 2016 12:12 PM | Updated on Apr 3 2019 6:23 PM

పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు - Sakshi

పిల్లలతో కలసి ఆటోలో హీరో షికారు

హృతిక్ రోషన్ మాత్రం తన కొడుకులు హ్రేహాన్, హృదాన్లతో కలసి ఆటోలో షికారుకు వెళ్లాడు.

ముంబై: సరదాగా షికారుకు వెళ్లాలంటే ఏ ఖరీదైన స్పోర్ట్స్ బైకులోనో లేదా లగ్జరీ కారులోనో వెళ్లొచ్చు. అందులోనూ క్రేజ్ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో. అయితే హృతిక్ రోషన్ మాత్రం తన కొడుకులు హ్రేహాన్, హృదాన్లతో కలసి ఆటోలో షికారుకు వెళ్లాడు.

తన పిల్లలతో కలసి ఆటోలో ముంబై వీధుల్లో తిరుగుతూ హృతిక్ తెగ ఎంజాయ్ చేశాడు. కార్లు తప్ప ఆటో ఎక్కని హృతిక్ కొడుకులకూ ఈ ప్రయాణం కొత్తగా అనిపించింది. హృతిక్ తన కొడుకులతో ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాము ముగ్గురం బాగా ఎంజాయ్ చేశామని, తక్కువ పాకెట్ మనీతో ఆటో ప్రయాణం తన పిల్లలకు కొత్త అనుభవమని హృతిక్ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement