సవతి తండ్రి నీల ప్రసాద్ రావు తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో తాను అజ్ఞాతంలోకి వెళ్లానని వర్ధమాన నటి సాయి శిరీష ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వూలో వెల్లడించడం సంచలనం రేపింది.
హీరోయిన్ పై సవతి తండ్రి లైంగిక వేధింపులు!
Aug 20 2013 2:06 PM | Updated on Aug 28 2018 4:30 PM
సవతి తండ్రి నీల ప్రసాద్ రావు తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో తాను అజ్ఞాతంలోకి వెళ్లానని వర్ధమాన నటి సాయి శిరీష ఓ టెలివిజన్ చానెల్ కిచ్చిన ఇంటర్వూలో వెల్లడించడం సంచలనం రేపింది.
లవ్ ఎటాక్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన శిరీష అదృష్యమైనట్టు సవతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 27 తేది తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అదృష్యమైన శిరీష నాటకీయ ఫక్కిలో సోమవారం రాత్రి టెలివిజన్ చానెల్ లో కనిపించడంతో పోలీసులు కంగు తిన్నారు.
నీల ప్రసాద్ రావు ఇచ్చిన ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం తప్పుదారి పట్టించే విధంగా ఉండటంతో పోలీసుల్లో పలు సందేహాలు తలెత్తాయి. నీల ప్రసాద్ వ్యవహారశైలిపై పోలీసులు కూడా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా టెలివిజన్ చానెల్లో మాట్లాడుతూ తాను లొంగిపోకపోయినా.. లైంగిక వేధింపుల విషయాన్ని ఎవరికైనా తెలిపినా.. తన సవతి తండ్రి చంపేస్తానని బెదిరించాడని శిరీష చెప్పింది. తన తల్లి ఇంట్లో లేని సమయంలో తనపై లైంగికంగా వేధించేవాడని, తన తల్లి సవతి తండ్రిపై ఆధారపడి ఉందని.. అందుకే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది.
Advertisement
Advertisement