'మెగా' ఫ్యామిలీలోకి మరో మెంబర్! | Hero ram charan added a new member to his family | Sakshi
Sakshi News home page

'మెగా' ఫ్యామిలీలోకి మరో మెంబర్!

Nov 29 2014 10:25 AM | Updated on Sep 2 2017 5:21 PM

'మెగా' ఫ్యామిలీలోకి మరో మెంబర్!

'మెగా' ఫ్యామిలీలోకి మరో మెంబర్!

'మెగా' ఫ్యామిలీలోకి మరో మెంబర్ వచ్చి చేరింది. హీరో రాంచరణ్ ఆ కొత్త సభ్యురాలిని తన ఇంట్లోకి చేర్చాడు. అయితే అది బేబీనో... పక్షో..జంతువో కాదండోయ్.... సరికొత్త కారు.

'మెగా' ఫ్యామిలీలోకి మరో మెంబర్ వచ్చి చేరింది. హీరో రాంచరణ్ ఆ కొత్త సభ్యురాలిని తన ఇంట్లోకి చేర్చాడు. అయితే  అది బేబీనో... పక్షో..జంతువో కాదండోయ్.... సరికొత్త కారు.  అలాంటిలాంటి కారు కాదండోయ్...సరికొత్త రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. చెర్రీ తన కోసం కొనుకున్న ఈ కారు ధర అక్షరాలా రూ. 3.5 కోట్లు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఈ కారును కొనుగోలు చేసిన తొలి వ్యక్తి చెర్రీనే.

విశాఖ హుద్ హుద్ తుపాను బాధితుల సహాయార్థం 'మేము సైతం' కార్యక్రమం ప్రెస్మీట్కు రాంచరణ్... రేంజ్ రోవర్ను స్వయంగా డ్రైవ్ చేసుకుని వచ్చాడు. చెర్రీ పక్కనే నాగార్జున...తనయుడు అఖిల్ కూడా ఉన్నాడు. సరికొత్త కారుతో... వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు.  దాంతో రాంచరణ్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్గా నిలిచాడు. రాంచరణ్కి కార్లంటే తగని ఇష్టం. అందుకు తగ్గట్టే చిరంజీవి కూడా తనయుడికి ఖరీదైన కార్లు గిప్ట్ ఇచ్చేవారు.

కాగా ఇటీవలే తండ్రి పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్ ....ల్యాండ్‌ క్రూజర్‌ విఎక్స్‌, వి8 మోడల్‌కి చెందిన కారును బహుమతిగా ఇచ్చాడు.  గతంలో ఈ హీరో ...చిరంజీవికి రోల్స్ రాయిస్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ లెక్కన వింటుంటే... చెర్రీ కాంపౌండ్లో ఖరీదైన కార్లు చాలానే ఉన్నట్లున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement