శింబు సరసన నటించడానికి నటి హన్సిక నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ జంట ఇప్పటికే వాలు, వేట్టై మన్నన్ చిత్రాల్లో కలిసి నటిస్తున్నారు.
శింబు సరసన నటించడానికి నటి హన్సిక నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ జంట ఇప్పటికే వాలు, వేట్టై మన్నన్ చిత్రాల్లో కలిసి నటిస్తున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొలకెత్తింది. అయితే తాజాగా శింబు, హన్సికల ప్రేమ బ్రేకప్ అయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో విషయం ఏమిటంటే శింబు సరసన మరో చిత్రంలో నటించే అవకాశాన్ని హన్సిక తిరస్కరించినట్లు తెలిసింది. అందుకు కారణం ఆ చిత్రంలో మరో హీరోయిన్‌గా నయనతార నటిస్తుండటమేనట. శింబు ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చట్టెన్‌డ్రు మారువదు వానిలె చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పగలు రాత్రి శరవేగంగా జరుగుతోంది. 

