ఘాజీ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్..? | Ghazi Director Sankalp Reddy next Movie with Varun Tej | Sakshi
Sakshi News home page

ఘాజీ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్..?

Apr 16 2017 12:29 PM | Updated on Sep 5 2017 8:56 AM

ఘాజీ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్..?

ఘాజీ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫిక్స్..?

తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ

తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి. రానా హీరోగా 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ సినిమా ఘనవిజయం సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలను అందుకుంది. ఇంతటి ఘనవిజయం సాధించిన తరువాత సంకల్ప్ రెడ్డి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్పై అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

తాజాగా సమాచారం ప్రకారం సంకల్ప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమా కూడా ఘాజీ తరహాలో ప్రయోగాత్మకంగానే ఉండబోతుందని తెలుస్తోంది. మిస్టర్ ఫెయిల్యూర్తో డైలామాలో పడ్డ వరుణ్కు ఇది క్రేజీ ఆఫర్ అనే చెప్పాలి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఫిదా పూర్తయిన తరువాత సంకల్ప్ రెడ్డితో చేయబోయే సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement