ప్రభాస్‌ రేంజ్‌ హీరో అవుతాడు | ganta Ravi, Jayadev movie is getting ready for release | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ రేంజ్‌ హీరో అవుతాడు

May 28 2017 12:11 AM | Updated on Sep 5 2017 12:09 PM

ప్రభాస్‌ రేంజ్‌ హీరో అవుతాడు

ప్రభాస్‌ రేంజ్‌ హీరో అవుతాడు

‘ఇండస్ట్రీలో ఇప్పుడు కాంబినేషన్‌కి తప్ప కథకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నాకు కథ ముఖ్యం.

‘ఇండస్ట్రీలో ఇప్పుడు కాంబినేషన్‌కి తప్ప కథకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నాకు కథ ముఖ్యం.  అది ఉంటే ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. ‘ఈశ్వర్‌’తో ప్రభాస్‌ని హీరోగా చేశాం. తను ఇప్పుడు  పెద్ద రేంజ్‌ హీరో అయినందుకు గర్వంగా ఉంది. గంటా రవి కూడా ప్రభాస్‌ రేంజ్‌ హీరో అవుతాడు’’ అని జయంత్‌ సి. పరాన్జీ అన్నారు. గంటా రవి, మాళవికా రాజ్‌ జంటగా కె.అశోక్‌కుమార్‌ తెరకెక్కించిన ‘జయదేవ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా జయంత్‌ సి. పరాన్జీ చెప్పిన విశేషాలు..కెమెరామేన్‌ జవహార్‌రెడ్డి గంటా రవిని పరిచయం చేశాడు.రవిని చూడగానే ఇతనితో సినిమా తీయొచ్చు అనిపించింది. కృషి, పట్టుదల, దీక్షతో ఈ చిత్రంలో ప్యాషన్‌తో నటించాడు. తమిళ ‘సేతుపతి’ చిత్రంలోని మెయిన్‌ ఎస్సెన్స్‌ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ‘జయదేవ్‌’ తీశా. పరుచూరి బ్రదర్స్‌ కథని బాగా డెవలప్‌ చేశారు. ∙సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ కథ ఇది. రెగ్యులర్‌ పోలీస్‌ చిత్రాల్లా ఉండదు.

రవి, మాళవికలకు లాంగ్‌ రన్‌ ఉంటుంది. ఇందులో వినోద్‌కుమార్‌ విలన్‌గా చేశారు. నా ‘అల్లరి పిడుగు, తీన్‌మార్‌’ చిత్రాలు సరిగ్గా ఆడలేదు. గ్యాప్‌ తీసుకుని రైట్‌ టైమ్‌లో చేసిన చిత్రం ‘జయదేవ్‌’. మళ్లీ నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే చిత్రమవుతుంది. మణిశర్మ మంచి పాటలిచ్చారు. ‘ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్‌’ తర్వాత అశోక్‌కుమార్‌గారితో చేసిన ‘జయదేవ్‌’ మా కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సాధిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement