సన్నీకే అలా అనిపిస్తే..
గతేడాది 'బాహుబలి' సినిమా సృష్టించిన మేనియా తెలియనిది కాదు.
	గతేడాది 'బాహుబలి' సినిమా సృష్టించిన మేనియా తెలియనిది కాదు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బాహుబలి.. కళ్లు చెదిరే కలెక్షన్లతో బాక్సాఫీసును అదరగొట్టింది. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనుకుంటూ టిక్కెట్ల కోసం తిప్పలు పడ్డ అభిమానులు లేకపోలేదు. అంతటి హైప్ క్రియేట్ చేసిన ఆ సినిమాని చూసేందుకు ఎట్టకేలకు ఏడాది తర్వాత తీరిక దొరికింది బాలీవుడ్ క్రేజీ స్టార్ సన్నీ లియోన్కి.
	
	ఫైనల్లీ బాహుబలి సినిమాను చూశానంటూ సన్నీ ట్విట్టర్లో తెలిపింది. సినిమా చూశాక ఇక ఇప్పుడు బాహుబలి-2 కోసం ఎదురుచూడాలంటూ ట్వీట్ చేసింది. విడుదలైన ఏడాది తర్వాత తీరికగా సినిమా చూసిన సన్నీకే అలా అనిపిస్తే... రిలీజైన రెండో రోజే ధియేటర్ని దడ దడలాడించిన మనకెలా ఉండాలి? ఇంతకీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినట్టు..??
Finally watched Bahubali and really!!??? That's how it ends!!! Now I have to wait for part 2!! Blah blah!
— Sunny Leone (@SunnyLeone) July 31, 2016

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
