ఫెయిల్యూర్స్‌ను ఎంజాయ్‌ చేస్తాను

Failures Will Be Enjoye Says Bobby Simha - Sakshi

‘‘తెలుగులో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. వస్తున్నాయి. కానీ కథ లేని సినిమాల్లో నటించడం ఇష్టం ఉండదు. కథ బాగుంటేనే యాక్టర్‌గా నటించడానికి మనకు పని ఉంటుంది. పారితోషికంనాకు రెండో ప్రాధాన్యం. కంటెంట్‌ ముఖ్యం’’ అన్నారు నటుడు బాబీ సింహా. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రంలో విలన్‌ పాత్ర పోషించిన బాబీ సింహా చెప్పిన విశేషాలు.

మా తల్లిదండ్రులది విజయవాడ దగ్గర బందర్‌. నేను హైదరాబాద్‌లో పుట్టాను. నాలుగో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. పదో తరగతి వరకు అవనిగడ్డలో చదువుకున్నాను.1995లో తమిళనాడులోని కొడైకెనాల్‌కు వెళ్లాం. 

‘డిస్కోరాజా’లో నేను సేతు పాత్రలో కనిపిస్తాను. నా పాత్రలో స్టైల్, కోపం, హాస్యం.. ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయి. యంగ్‌ ఏజ్‌ అండ్‌ ఓల్డ్‌ ఏజ్‌లా సినిమాలో నావి రెండు లుక్స్‌ ఉన్నాయి. రవితేజగారు సెట్‌లో ఫుల్‌ ఎనర్జీతో ఉంటారు. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్, టైమింగ్‌ బాగుంటాయి. నేను దాదాపు 45 సినిమాలు చేశాను. నా కెరీర్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ డైరెక్టర్స్‌గా ఆనంద్‌గారి పేరు చెబుతాను. ఆనంద్‌గారు కంటెంట్‌ ఉన్న సినిమాలు తీస్తుంటారు.

నటుడిగా నాకు అన్ని పాత్రలు చేయాలని ఉంది. పాజిటివ్‌ క్యారెక్టర్‌ అయితే కొన్ని పరిమితులకు లోబడి చేయాల్సి ఉంటుంది. అదే నెగటివ్‌ క్యారెక్టర్‌ అయితే యాక్టింగ్‌కు ఎలాంటి పరిమితులు ఉండవని నా భావన. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాదు.. కథ బాగుంటే నటిస్తాను.

రజనీకాంత్‌గారు నాకు స్ఫూర్తి. ‘పేట’లో ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాను. ప్రస్తుతం కమల్‌హాసన్‌గారి ‘ఇండియన్‌ 2’లో ఓ కీలక పాత్ర చేస్తున్నాను. కమల్‌గారికి అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన ఉంది. తమిళంలో నా గత చిత్రాలు సక్సెస్‌ కాలేదు. ఫెయిల్యూర్స్‌ను ఎంజాయ్‌ చేస్తాను. కానీ, ఆడని సినిమాలు ఎందుకు సక్సెస్‌ కాలేదో విశ్లేషించుకుంటాను. నాతో పాటు స్టార్ట్‌ అయిన విజయ్‌ సేతుపతి ముందుకు పరిగెడుతున్నారు అంటున్నారు. నేను వెనక నుంచి చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాను. నేను స్టార్ట్‌ చేస్తా. యాక్టర్స్‌లో కొందరు 100 స్పీడ్‌లో పరిగెడతారు. మరికొందరు 40. నేను 10 –15 స్పీడ్‌లో ఉన్నాననుకుంటున్నాను. కానీ రేస్‌లో మాత్రం ఉన్నాను.  

కెరీర్‌ మొదట్లో చాలా సినిమాల్లో జూనియర్‌ ఆరి్టస్టుగా చేశాను. కష్టాలు అనుభవించాను. అయితే అప్పటితో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ స్థాయి పెరిగింది. సోషల్‌ మీడియా ఉంది. నేను మొదట్లో తిరిగినట్లు చాలామంది హైదరాబాద్, చెన్నైలో యాక్టర్స్‌ కావాలని తిరుగుతుంటారు. దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు. అవకాశం కోసం ఎదురుచూడండి. వచి్చనప్పుడు మాత్రం శక్తి వంచన లేకుండా పని చేసి మనల్ని మనం నిరూపించుకోవాలి.

అవార్డుకు అనుభవం అనేది ఒక కొలమానంగా ఉండాలనే మాట నా దృష్టిలో సరైంది కాదనుకుంటాను. అవార్డు అనేది ప్రేక్షకులు, ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు. నాకు కానివ్వండి, ఇంకొకరికి కానివ్వండి. మనం చేసే పాత్రకు మనం న్యాయం చేశామా? లేదా? ప్రేక్షకులు మనల్ని గుర్తించారా? లేదా అన్నదే ముఖ్యం. ‘జిగర్తాండ’ చిత్రానికి నాకు జాతీయ అవార్డు రావడం సంతోషాన్నిచి్చంది. నిజానికి నాకు జాతీయ అవార్డు గురించి మొదట్లో తెలియదు. నేను జూనియర్‌ ఆర్టిస్టుగా ఉన్నప్పుడు... ‘‘సార్‌... నేషనల్‌ అవార్డు అనేది నేను చేసినా కూడా వస్తుందా? అని అడిగితే, ‘హే... బాబీ అది నేషనల్‌ అవార్డు’ వదిలేయ్‌ అని ఓ డైరెక్టర్‌ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top