డిస్కో రాజా నుంచి మరో టీజర్‌

Disco Raja 2nd Teaser Released - Sakshi

టచ్‌ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్‌ అక్బర్‌ ఆంటోనీ.. వరుస ఫ్లాపులతో మాస్‌ మహారాజ రవితేజ సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి కొత్త కథతో, మాస్‌ వదిలి క్లాస్‌ లుక్‌తో డిస్కో రాజాగా ముందుకొస్తున్నాడు. ఈ సినిమాపై రవితేజ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఈపాటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ అదిరిపోయాయి. రవితేజ కొత్తలుక్స్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా డిస్కో రాజా టీం మరో టీజర్‌ను వదిలింది. ‘సోల్జర్స్‌ సంవత్సరాల పాటు బాంబింగ్స్‌తోను, ఫైరింగ్స్‌తోను, యుద్ధాలు చేసి రిటైర్‌ అయి ఇంట్లో ఉంటే సడన్‌గా వచ్చే సైలెన్స్‌ ఉంటది చూడు.. అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయొలెన్స్‌ కంటే భయంకరంగా ఉంటుంది’ అంటూ టీజర్‌ ప్రారంభమవుతుంది. రవితేజ స్టైలిష్‌ లుక్స్‌లో కనిపిస్తుండగా డైలాగ్స్‌ బాగున్నాయి. రవితేజ డ్యాన్స్‌ చేస్తూ తుపాకీతో కాల్చి చంపడం డిఫరెంట్‌గా ఉంది.

‘డిస్కో రాజా’ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ వీఐ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రజని తళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. చదవండి: ‘డిస్కోరాజా’ టీజర్‌ వచ్చేసింది!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top