తిరుమలలో దిల్‌ రాజు దంపతులు | Dil Raju And Tejaswini Visits Tirumala After Wedding | Sakshi
Sakshi News home page

వెంకన్నను దర్శించుకున్న దిల్‌ రాజు దంపతులు

Jun 21 2020 10:44 AM | Updated on Jun 21 2020 11:09 AM

Dil Raju And Tejaswini Visits Tirumala After Wedding - Sakshi

సాక్షి, తిరుప‌తి: ప్ర‌ముఖ నిర్మాత దిల్ ‌రాజు త‌న సతీమ‌ణి తేజ‌స్వినితో క‌లిసి తొలిసారిగా తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించారు. శుక్ర‌వారం ఉద‌యం స‌తీస‌మేతంగా స్వామివారిని ద‌ర్శించి ఆశీస్సులు అందుకున్నారు. మాస్కు ధ‌రించిన‌ దిల్ రాజు గుండుతో క‌నిపించారు. అయిన‌ప్ప‌టికీ అత‌డిని గుర్తుప‌ట్టిన ఆయ‌న అభిమానులు దంప‌తుల‌ సెల్ఫీలు, వీడియోల కోసం ఎగ‌బ‌డ్డారు. కాగా ఆయ‌న లాక్‌డౌన్ స‌మ‌యంలోనే పెళ్లి బాజాలు మోగించిన విష‌యం తెలిసిందే. (శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్‌)

మే 10న నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లం న‌ర్సింగ్‌ప‌ల్లిలో గ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో నిరాడంబ‌రంగా వివాహం చేసుకున్నారు. ఇది దిల్ రాజుకు రెండో వివాహం. ఈ పెళ్లికి అత‌ని కూతురు హ‌న్షిత రెడ్డి స‌హా కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. మొద‌టి భార్య అనిత 2017లో గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుండ‌గా దిల్ రాజు నిర్మాత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా "వ‌కీల్ సాబ్" రూపుదిద్దుకుంటోంది. (దిల్‌ వాకిట్లో తేజస్విని)


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement