సినిమాలో మ్యాటర్‌ ఉంది | Desamlo Dongalu Paddaru Telugu Movie PressMeet | Sakshi
Sakshi News home page

సినిమాలో మ్యాటర్‌ ఉంది

Oct 4 2018 12:45 AM | Updated on Oct 4 2018 12:45 AM

Desamlo Dongalu Paddaru Telugu Movie PressMeet - Sakshi

ఖయ్యూమ్, అలీ, పృథ్వీ

‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా నాకు బాగా నచ్చింది. ఖయ్యూమ్‌తో దర్శకుడు గౌతమ్‌ వైవిధ్యమైన సినిమా చేశాడు. టెక్నికల్‌గా ది బెస్ట్‌ మూవీ చేశారు. చిరంజీవిగారు మా సినిమా ట్రైలర్‌ విడుదల చేయటం మాకు చాలా కలిసి వచ్చింది. ఈ సినిమాలో మ్యాటర్‌ ఉంది. సినిమా చూడండి.. నచ్చితే ఆదరించండి’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్‌ రాజన్, షానీ, పృథ్వీ, సమీర్, లోహిత్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’.

గౌతమ్‌ రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో అలీ సమర్పణలో రమా గౌతమ్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఖయ్యూమ్‌ మాట్లాడుతూ– ‘‘నేను చాలా సినిమాలు చేశా. అయితే రిలీజ్‌కు ముందు నుంచే ‘దేశంలో దొంగలు పడ్డారు’ చిత్రానికి మంచి పాజిటివ్‌ బజ్‌ వచ్చింది’’ అన్నారు. ‘‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నేపథ్యంలో రియలిస్టిక్‌గా చేసిన చిత్రమిది. అలీగారి వల్లే ఈ సినిమా రిలీజ్‌ వరకు వచ్చింది’’ అన్నారు గౌతమ్‌ రాజ్‌ కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement