ఓడిన రమ్యపై విమర్శలు | Defeated ramya was critizied | Sakshi
Sakshi News home page

ఓడిన రమ్యపై విమర్శలు

May 28 2014 11:51 PM | Updated on Sep 2 2017 7:59 AM

ఓడిన రమ్యపై విమర్శలు

ఓడిన రమ్యపై విమర్శలు

ఎన్నికల్లో ఓటమి పాలైన నటి రమ్యపై కన్నడ హీరో ఘాటుగా విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో ఓటమి పాలైన నటి రమ్యపై కన్నడ హీరో ఘాటుగా విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనపై రమ్య మండిపడుతున్నారు. తమిళంలో కుత్తు, పొల్లాదవన్, వానరం ఆయిరం తదితర చిత్రాల్లో నటించిన రమ్య కన్నడంలో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.

దీంతో నటనకు స్వస్తి చెప్పారు. ఆ సమయంలో నీర్ టోస్‌లాంటి కొన్ని చిత్రాలను అంగీకరించి ఆ తరువాత నటించలేదు. ఆ కారణంగా ఆ చిత్ర హీరో జగ్గేష్, దర్శకుడు విజయప్రసాద్ రమ్యపై తీవ్రంగా విమర్శించారు. రమ్య, జగ్గేష్ తరచు ట్విట్టర్‌లో ఢీకొంటూనే ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన రమ్య ఓటమిపాలయ్యారు. అంతేకాదు మళ్లీ నటిస్తానని ప్రకటించారు. దీంతో నటుడు జగ్గేష్ మరోసారి రమ్యపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో గెలిస్తే రమ్య మళ్లీ నటించేవారా? ఆమె సందర్భవాది అని ఎటు అవకాశం ఉంటే అటు దూకేసే మనస్తత్వం రమ్యదని విమర్శలు కురిపించారు. దీంతో జగ్గేష్‌పై రమ్య మండిపడుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement