కలిసి నటిస్తున్న మాజీ ప్రేమికులు

Deepika Padukone And Ranbir Kapoor to Collaborate for Anurag Basu - Sakshi

బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌ రణబీర్‌ కపూర్‌, స్టార్ హీరోయిన్‌ దీపికా పదుకొనేలు ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకు తిరిగిన సంగతి తెలిసిందే. హే జవానీ హై దివానీ, తమాషా సినిమాల్లో ఆకట్టుకున్న ఈ జోడి, ఆఫ్‌ స్క్రీన్‌ కూడా రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. కానీ వీరి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. రణబీర్‌తో బ్రేక్‌అప్‌ చెప్పేసిన దీపిక రణవీర్‌తో ఏడడుగులు నడిచింది.

బ్రేక్‌ అప్‌ తరువాత ఈ జోడి వెండితెర మీద కూడా కనిపించలేదు. ఇన్నాళ్ల తరువాత దీపిక, రణబీర్‌లు కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారట. అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కనున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో రణబీర్‌, దీపికలు నటించనున్నారు. అంతేకాదు లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో రూపొందనున్న మరో సినిమాలో ఈ జంటను నటింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top