ఏం జరుగుతుంది? | darpanam released on september 6 | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతుంది?

Aug 24 2019 5:59 AM | Updated on Aug 24 2019 5:59 AM

darpanam released on september 6 - Sakshi

తనిష్క్‌ రెడ్డి, ఎలక్సియస్‌

తనిష్క్‌ రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ  వెంప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్పణం’. శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 6న విడుదల కానుంది. రామకృష్ణ వెంప మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్‌ జోనర్‌లో ఇటీవల వచ్చిన సినిమాలు విజయం సాధించాయి. వాటి తరహాలోనే క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌ జోనర్‌లో మా సినిమా తెరకెక్కింది.

చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తూ ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుంది. క్రాంతి కిరణ్‌గారి సహకారం మర్చిపోలేనిది’’ అన్నారు. క్రాంతి కిరణ్‌ వెల్లంకి మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ వచ్చిన థ్రిల్లర్‌ సినిమాలకు మించి మా చిత్రంలో మంచి కథాంశం ఉంది. రామకృష్ణ మేకింగ్‌ మా చిత్రానికి మంచి అసెట్‌ అవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement