తీరిక దొరికితే ఏడ్చి ఉండేదాన్ని! | Crying'd get busy! | Sakshi
Sakshi News home page

తీరిక దొరికితే ఏడ్చి ఉండేదాన్ని!

Sep 1 2015 12:11 AM | Updated on Sep 3 2017 8:29 AM

తీరిక దొరికితే ఏడ్చి ఉండేదాన్ని!

తీరిక దొరికితే ఏడ్చి ఉండేదాన్ని!

సమంతకు ఓ విచిత్రమైన అలవాటు ఉందట. అదేంటంటే, స్క్రీన్ మీద తనను తాను చూసుకోవడం ఇష్టం ఉండదట.

సమంతకు ఓ విచిత్రమైన అలవాటు ఉందట. అదేంటంటే, స్క్రీన్ మీద తనను తాను చూసుకోవడం ఇష్టం ఉండదట. అలాగని చేసిన సినిమా చూడకుండా ఉండలేను కదా అంటున్నారు. పైగా, తాజా తమిళ చిత్రం ‘10 ఎన్రదుకుళ్ల’లో భిన్న కోణాలున్న పాత్ర చేశారట. అందుకని, ఇష్టం చేసుకుని మరీ ఈ చిత్రం చూడటానికి ట్రై చేస్తానని ఈ బ్యూటీ అంటున్నారు. ప్రస్తుతం తమిళంలో ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు కానీ, ‘ఏ మాయ చేశావె’ విజయంతోతెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారామె. కొన్నాళ్ల పాటు తమిళ సినిమాలు చేసే తీరిక సమంతకు చిక్కలేదు.

తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా మొదలైన ఆమె కెరీర్ తమిళంలో మాత్రం ఫెయిల్యూర్‌తో మొదలైంది. సమంత నటించిన తొలి తమిళ చిత్రం ‘బాణా కాత్తాడి’ ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, పెద్దగా బాధపడలేదని ఇటీవల ఓ సందర్భంలో సమంత పేర్కొన్నారు. ఎందుకు బాధపడలేదో చెబుతూ - ‘‘తెలుగులో ‘ఏ మాయ చేశావె’ సూపర్ హిట్ కావడంతో, ఈ తమిళ సినిమా ఫెయిల్యూర్ గురించి ఆలోచించే తీరిక చిక్కలేదు. ఒకవేళ తీరిక చిక్కి ఉంటే, అప్పుడు బాగా ఏడ్చేదాన్ని. బహుశా నా ఏడుపుని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాకపోయి ఉండేది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement