వివాదాల్లో రజనీ.. కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు

Complaints Against Rajinikanth Over Remarks On Periyar - Sakshi

న్యూఢిల్లీ: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్‌పై సంచలన ఆరోపణలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు మండిపడుతున్నారు. రాజకీయరంగ ప్రవేశం కోసం రజనీ తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళగం అధ్యక్షుడు కొళత్తూర్‌ మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ద్రావిడర్‌ విడుదలై మణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డిమాండ్ చేశారు. కాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

చదవండి: రజనీ చరిత్ర తెలుసుకో.. ద్రవిడ పార్టీల ఆగ్రహం

ఈనెల 14న రజనీ తుగ్లక్ పత్రిక వార్షికోత్సవంలో పాల్గొన్నాడు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తు చేశారు. అప్పట్లో  పెరియార్‌ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించారు.ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో పెరియార్‌ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా మాట్లాడారని ఆరోపించారు. రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధపడుతున్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎటువంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top