చిరంజీవికి 'వాస్తు' ఎఫెక్ట్ | chiranjeevi makes extensive changes to house according to vastu | Sakshi
Sakshi News home page

చిరంజీవికి 'వాస్తు' ఎఫెక్ట్

Oct 13 2014 11:22 AM | Updated on Aug 13 2018 4:19 PM

చిరంజీవికి 'వాస్తు' ఎఫెక్ట్ - Sakshi

చిరంజీవికి 'వాస్తు' ఎఫెక్ట్

ఈ మధ్య కాలంలో 'వాస్తు' బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం వాస్తు సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ...

ఈ మధ్య కాలంలో 'వాస్తు' బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం వాస్తు సీజన్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వాస్తు ప్రకారం తమ కార్యాలయాలు మార్పులు చేర్పులు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కూడా ఆ లిస్ట్లో చేరిపోయారు. జూబ్లీహిల్స్లోని తన నివాసానికి ఆయన భారీ ఎత్తున మార్పులు, చేర్పులు చేయిస్తున్నట్లు సమాచారం.

వెండితెర నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన చిరంజీవి అనుకున్న స్థాయిలో రాజకీయ నేతగా రాణించలేకపోయారు. సొంతపార్టీని 'హస్త'గతం చేసిన ఆయన... దానికి ఫలితంగా కేంద్రమంత్రి పదవి కూడా అందుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో హస్తం మట్టికరిచిపోవటంతో చిరంజీవి పరిస్థితి కూడా ఆటలో అరటిపండే అయ్యింది. దాంతో ఆయన సినిమాల్లో రీఎంట్రీపై దృష్టి పెట్టారు. తన 15౦వ సినిమా కోసం చిరంజీవి పెద్ద ఎత్తున కసరత్తే చేస్తున్నారు.  

ఈ నేపథ్యంలో మళ్లీ పూర్వ వైభవం కోసం చిరంజీవి వాస్తును నమ్మకున్నట్లు తెలుస్తోంది. వాస్తు దోషం వల్లే ఆయన రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయినట్లు కొందరు చెప్పారట. దాంతో చిరంజీవి వెంటనే వాస్తు నిపుణులను సంప్రదించటం వారు ఇచ్చిన సలహాను పాటించేశారు. దాంతో గత తొమ్మిదేళ్లుగా ఉంటున్న నివాసాని్న వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయిస్తున్నారట. గుర్తు పట్టలేనంతగా ఆ ఇల్లు మారిపోతోంది.  

మరోవైపు మరమ్మతుల నేపథ్యంలో డిస్ట్రబెన్స్ కారణంగా చిరంజీవి ఫ్యామీలి హాలిడే ట్రిప్ వేసింది. చిరంజీవి తనయుడు రాంచరణ్, కోడలు ఉపాసన.. అంతా కలిసి విదేశాల్లో విహరిస్తున్నారు. వీరంతా మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. మరి చిరంజీవికి 'వాస్తు' ఏమేరకు కలిసి వస్తుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

chiranjeevi, vastu, house, cinema, చిరంజీవి, వాస్తు, నివాసం, సినిమాలు, ఇల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement