మెగా ఆడియోకి ముహూర్తం ఫిక్స్ | Chiranjeevi Khaidi Number 150 Audio release date, Venue | Sakshi
Sakshi News home page

మెగా ఆడియోకి ముహూర్తం ఫిక్స్

Dec 8 2016 11:04 AM | Updated on Jul 12 2019 4:40 PM

మెగా ఆడియోకి ముహూర్తం ఫిక్స్ - Sakshi

మెగా ఆడియోకి ముహూర్తం ఫిక్స్

మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ రోజు.., ఇంకా ఎంతో దూరంలో లేదు.

మెగా అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ రోజు.., ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినీ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొనే ఈ ఈవెంట్కు ముహుర్తం వేదిక ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.

ఈ శుక్రవారం రామ్చరణ్ ధృవ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో పాటు ఖైదీ నంబర్ 150 ట్రైలర్ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఆ తరువాత డిసెంబర్ 25న ఈ సినిమా ఆడియో వేడుకను మెగా అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు విజయవాడలోని ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం వేదిక కానుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రామ్చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తుండగా, మాస్ సినిమాల స్పెషలిస్ట్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement