వలస కార్మికుడే హీరో

Central Sensor Board Approves Lockdown Movie Trailer - Sakshi

‘పండుగాడు ఫొటో స్టూడియో’ ఫేమ్‌ దర్శకుడు దిలీప్‌రాజా ‘లాక్‌డౌన్‌’ అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. ‘లాక్‌డౌన్‌’ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌ ఆమోదం ఇచ్చినట్లుగా దిలీప్‌రాజా తెలిపారు. ఈ సినిమాను విజయ బోనెల, ప్రదీప్‌ దోనూపూడి నిర్మించనున్నారు. ఈ ‘లాక్‌డౌన్‌’ సినిమా గురించి దిలీజ్‌ రాజా మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ  చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఒకవైపు కరోనా వైరస్‌ నుంచి తమను తాము కాపాడుకుంటూ మరోవైపు గమ్యస్థానానికి బయలుదేరిన వలసకూలీల బతుకు చిత్రమే ‘లాక్‌డౌన్‌’. ఈ చిత్రంలో వలస కార్మికుడే హీరో. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలనే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అలాగే ‘యూత్‌: కుర్రాళ్ళ గుండె చప్పుడు’ అనే చిత్రాన్ని కూడా డైరెక్ట్‌ చేస్తున్నారు దిలీప్‌రాజా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top