హ్యాపీ బర్త్డే డార్లింగ్ | celebrity wishes for Bahubali Hero Prabhas | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్డే డార్లింగ్

Oct 23 2015 10:20 AM | Updated on Jul 14 2019 4:05 PM

హ్యాపీ బర్త్డే డార్లింగ్ - Sakshi

హ్యాపీ బర్త్డే డార్లింగ్

బాహుబలి సక్సెస్తో ప్రస్తుతం నేషనల్ లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఈ రోజు( శుక్రవారం) పుట్టినరోజు జరుపుకున్నాడు. తన గత పుట్టినరోజులతో పోలిస్తే ఈ సారి బర్త్ డే ప్రభాస్కు చాలా స్పెషల్, ఇండియన్ ఫిలిం...

బాహుబలి సక్సెస్తో ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇవాళ ( శుక్రవారం) పుట్టినరోజు జరుపుకున్నాడు. తన గత పుట్టినరోజులతో పోలిస్తే ఈ సారి బర్త్ డే ప్రభాస్కు చాలా స్పెషల్, ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే భారీ విజయాల్లో ఒకటిగా నమోదైన బాహుబలి రిలీజ్ తరువాత జరుపుకుంటున్న పుట్టిన రోజు కావటంతో ప్రభాస్ చాలా ఆనందంగా ఉన్నాడు.

అభిమానులు ముద్దుగా పిలిచే డార్లింగ్... ఈసారి కూడా తన పుట్టినరోజును క్లోజ్ ఫ్రెండ్స్తో ప్రైయివేట్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం సోషల్ సైట్స్లో ప్రభాస్ బర్త్డేని గ్రాండ్ గానే సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో బిగెస్ట్ హిట్ అందించిన దర్శకుడు రాజమౌళితో పాటు హీరోయిన్ సమంత,  అక్కినేని అఖిల్, శర్వానంద్,  సుమంత్, కొరటాల శివ, సుజిత్, తమన్నా, చార్మీలతో పాటు ఇంకా చాలా మంది స్టార్స్ ..డార్లింగ్ ప్రభాస్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ సైట్లలో కామెంట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement