ప్రముఖ నటుడు జగదీప్‌ కన్నుమూత

Bollywood Actor Jagdeep Last Breath At 81 In Mumbai - Sakshi

ముంబై: ప్రముఖ నటుడు, బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్(81) అలియాస్‌ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ మృతి చెందారు. ముంబైలోని ఆయన నివాసంలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బుధవారం రాత్రి 8:40 గంటలకు కన్నుముశారు. మార్చి 29, 1939న జన్మించిన జగదీప్‌కు ఇద్దరూ  కుమారులు జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీలు ఉన్నారు. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి బాలీవుడ్‌ ప్రముఖులు, నటీనటులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. (చదవండి: దర్శక–నిర్మాత హరీశ్‌ షా కన్నుమూత)

జగదీప్‌ సహా నటుడు, కమెడియన్‌ జాన్‌ లీవర్‌ ఆయన ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘‘నా మొట్టమొదటి సినిమా ‘యే రిషితా నా టూటే’లో లెజెండ్‌ నటుడు జగదీప్‌తో కలిసి నటించాను. జగదీప్‌ భాయ్‌ వియ్‌ మిస్‌ యూ. ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్‌ చేశాడు. బాలీవుడ్‌లో దాదాపు 400లకుపైగా సినిమాలలో నటించిన జగదీప్‌ 1975లో వచ్చిన ‘షోలే’లో సూర్య భోపాలి పాత్రను పోషించారు. ఆయన నటించిన అదే పాత్ర పేరుతో వచ్చిన ‘సూర్య భోపాలి’ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారారు. ఆ తర్వాత అందాజ్‌ అప్నా, బ్రహ్మచారి, నాగిన్‌ వంటి సినిమాల్లో నటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top