గాయాలను లెక్కచేయని హీరోయిన్ | Bipasha basu shoots film despite injury | Sakshi
Sakshi News home page

గాయాలను లెక్కచేయని హీరోయిన్

Oct 20 2014 1:19 PM | Updated on Apr 3 2019 6:23 PM

గాయాలను లెక్కచేయని హీరోయిన్ - Sakshi

గాయాలను లెక్కచేయని హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసుకు పని మీద ఆసక్తి, చిత్తశుద్ధి చాలా ఎక్కువ. గాయపడినా కూడా షూటింగుకు విరామం ఇవ్వనని చెబుతోంది.

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసుకు పని మీద ఆసక్తి, చిత్తశుద్ధి చాలా ఎక్కువ. తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నిర్మాతకు, దర్శకుడికి, ఇతర నటీనటులకు ఇబ్బంది కలగకూడదని ఆమె భావిస్తుంటుంది. అందుకే.. చీలమండకు గాయం అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా షూటింగ్ చేస్తానని ముందుకు వస్తోంది. 'ఎలోన్' అనే సూపర్ నేచురల్ సినిమాలో ఆమె ప్రస్తుతం నటిస్తోంది. దాంతోపాటు భూషణ్ పటేల్ దర్శకత్వంలో కరణ్ సింగ్ గ్రోవర్ హీరోగా వస్తున్న సినిమాలోనూ బిపాసా చేస్తోంది.

ఈ రెండు సినిమాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాలు వాచినా కూడా పట్టించుకోకుండా షూటింగులకు హాజరవుతోంది. కాలికి ఓ బ్యాండేజి కట్టుకుని నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో తెలియజేసింది. కాలు నొప్పి పెడుతున్న మాట వాస్తవమేనని, అయినా షూటింగుకు మాత్రం ఇబ్బంది అవకూడదని చెప్పింది. ఇంతకుముందు విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన 'క్రీచర్ 3డి' అనే సినిమాలో బిపాషా నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement