ఈ వారం దొరికింది.. ఆమెను పంపించేస్తాం

Bigg Boss 3 Telugu: Vithika Will Be Eliminated In 13th Week - Sakshi

తెలుగు బిగ్‌బాస్‌ 3 సీజన్‌ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. పదమూడో వారానికి గానూ ఏడుగురు నామినేట్‌ అవగా ఎవరో ఒకరు లగేజీ సర్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక పొరపాటున కూడా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ అయిన రాహుల్‌, శ్రీముఖి, వరుణ్‌, బాబా భాస్కర్‌లు ఎలిమినేట్‌ అయ్యే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు నమోదైన పోల్స్‌ ప్రకారం వితిక, శివజ్యోతి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే నేటితో ఓట్లు వేయడానికి ఆఖరి రోజు కావటంతో లెక్కలు మారే అవకాశం ఉంది. లీకువీరుల అంచనా ప్రకారం హౌస్‌ నుంచి బయటకు వెళ్లేది వితికేనంటూ పేర్కొంటున్నారు. తను టాస్క్‌లు బాగా ఆడినప్పటికీ అతి తెలివి, స్వార్థబుద్ధితో ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది అని అభిప్రాయపడుతున్నారు.

పైగా తను ఇంట్లో ఉండటం వల్ల వరుణ్‌ సొంతంగా గేమ్‌ ఆడలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. వితిక ఒక అవకాశవాది అని వెనకాల గోతులు తీయడంలో దిట్ట అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా మెడాలియన్‌ టాస్క్‌లో బాబాకు వెన్నుపోటు పొడవటం కూడా ఆమెకు నెగిటివిటీగా మారింది. బిగ్‌బాస్‌ షో ప్రారంభంలో తప్పితే ఆ తర్వాత నామినేషన్‌ దరిదాపుల్లోకి రాకుండా వితిక, శివజ్యోతి తప్పించుకు తిరిగారని.. ఈ సారి వాళ్లను వదిలే ప్రసక్తే లేదంటున్నారు ప్రేక్షకులు. పైగా డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటే ఇద్దరినీ పంపించేస్తామని పేర్కొంటున్నారు. శివజ్యోతి కన్నింగ్‌ బిహేవియర్‌ అని, ఆమె ఏడుపు మొఖాన్ని చూడలేకున్నామని ఆమెను పంపించేయాలని మరికొంతమంది కోరుతున్నారు.

ఎటొచ్చీ ఈ ఇద్దరి మధ్య టఫ్‌ ఫైట్‌ నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్‌ను పరిశీలిస్తే వితిక బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి నిష్క్రమించడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు తొంభై రోజులుగా కలిసి ఉన్న భార్యాభర్తలను విడగొట్టడానికి బిగ్‌బాస్‌ రెడీ అయిపోయాడని సోషల్ మీడియాలో టాక్‌ వినిపిస్తోంది. కానీ ఒక్కరోజులో ఈ అంచనా తారుమారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి బిగ్‌బాస్‌ ఏమైనా ట్విస్టులు ఇస్తాడా? డబుల్‌ ఎలిమినేషన్‌ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తారా అన్నది వీకెండ్‌ ఎపిసోడ్‌లో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top