బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు | Bigg Boss 3 Telugu : Ravikrishna Was Trolled Without His Mistake | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : రవిపై ట్రోలింగ్‌.. అది నిజం కాదు

Sep 21 2019 4:45 PM | Updated on Sep 21 2019 4:49 PM

Bigg Boss 3 Telugu : Ravikrishna Was Trolled Without His Mistake - Sakshi

మంచోడు అనే ట్యాగ్‌లైన్‌తో బిగ్‌బాస్‌ హౌస్‌లో నెట్టుకొస్తున్న రవికృష్ణ.. ప్రస్తుతం వేరే గ్రూపుతో ఉంటున్నాడు. మొదట్లో వరుణ్‌-వితికా-రాహుల్‌-పునర్నవిలతో కలిసి ఉన్న రవి.. రానురానూ గ్యాప్‌ ఇస్తూ.. ప్రస్తుతం శ్రీముఖి గ్రూప్‌కి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే శివజ్యోతితో ఇంకాస్త ఎక్కువగా ఉంటూ హిమజతో కూడా మంచిగానే ఉంటున్నాడు. కానీ వరుణ్‌ బ్యాచ్‌తో దూరంగా ఉంటూ వస్తున్నాడు.

అయితే తొమ్మిదో వారానికిగానూ కెప్టెన్సీ టాస్క్‌లో అందరి అభిప్రాయం తీసుకుంటూ ఉండగా.. రవి నిర్ణయంపై పెద్ద చర్చే జరిగింది. ముందుగా.. వరుణ్‌ పేరు చెప్పావ్‌ కదా అని పునర్నవి అనగా.. ముందునుంచీ బాబా గారి పేరే చెబుతున్నానని తెలిపాడు. దీంతో అక్కడ పునర్నవి సైలెంట్‌ అయిపోయింది. మళ్లీ చివర్లో వరుణ్‌-వితికా-పున్ను-హిమజ మాట్లాడుకునేప్పుడు.. హిమజ కూడా అదే మాట చెప్పింది. మొదటగా వరుణ్‌ పేరే చెప్పాడని డిస్కషన్‌ పెట్టారు. 

ఇదే విషయమై సోషల్‌ మీడియాలో ఓ వీడియో కూడా ట్రెండ్‌ అవుతోంది. అయితే ఆ వీడియోలో మొదటగా.. బాబా భాస్కర్‌ పేరునే చెప్పాడు. మళ్లీ రివైండ్‌ చేసి ప్లే చేసిన దాంట్లో మహేష్‌ అన్న మాటలను రవి అన్నట్టుగా చూపించారు. వరుణ్‌ బ్రో అని మహేష్‌ అన్న డైలాగ్‌.. రవి అన్నట్లు చూపిస్తున్నారు. అయితే రవి మాత్రం ముందునుంచి బాబా పేరే చెప్పినట్టు కనిపిస్తున్నా.. పున్ను, హిమజ మాత్రం కాదని వాదిస్తున్నారు. అయితే తాజాగా ట్రెండ్‌ అవుతున్న ఈ వీడియోలో వరున్‌ బ్రో అన్నది మాత్రం మహేషే అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మీరూ ఓ సారి ఆ వీడియోను చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement