బిగ్‌బాస్.. అది సీక్రెట్ టాస్కా?

ప్రోమోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్‌బాస్ షో.. నెట్టింట చర్చకు దారితీస్తోంది. తినే విషయంలో బాబా భాస్కర్ హిమజను ఏదో అన్నట్లు, దానికి ఫీలైన హిమజ.. ఇంట్లో ఉన్న ఎగ్స్‌ను పగలగొట్టినట్లు చూపిస్తున్న ప్రోమోపై అందరూ చర్చించుకుంటున్నారు. ఇదేమైనా సీక్రెట్ టాస్కా? లేదా నిజంగానే గొడవ జరిగిందా? అని తెగ కామెంట్లు చేస్తున్నారు.
అయితే అది సీక్రెట్ టాస్క్ కావాలని? హిమజ ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. లేదా ఈ సంఘటనతో హిమజ ఎలిమినేట్ కావడం గ్యారంటీ అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హిమజకు కాస్త నెగెటివిటీ కూడా పెరుగుతోంది. ఎవరితోనూ సరిగా కలవకపోవడం, తన ధోరణిలోనే వెళ్లడం లాంటివి వీక్షకులకు చికాకుపుట్టించేలా ఉన్నాయి. ఈ వారంలో ఎలిమినేషన్ అయ్యేందుకు చాన్స్‌ఉన్న కంటెస్టెంట్‌గా హిమజ లిస్ట్‌లోకి వచ్చేసింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఉన్నది నిజమైతే.. ఈ వారం కచ్చితంగా హిమజనే ఎలిమినేట్ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గొడవ నిజంగా జరిగిందా? లేదా బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కా? అన్నది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి