పదమూడేళ్లకే మ్యూజిక్‌ డైరెక్టర్‌

Baroz 3D Mohanlal ropes in child prodigy pianist Lydian - Sakshi

మోహన్‌లాల్‌ దర్శకుడిగా మారబోతున్నారు. ‘బారోజ్‌’ అనే ఫ్యాంటసీ సినిమాలో నటిస్తూ, దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా లైడియన్‌ నాదస్వరం అనే పదమూడేళ్ల పిల్లాడిని పరిచయం చేయడం విశేషం. లైడియన్‌ అమెరికా టాలెంట్‌ షో ‘ద వరల్డ్స్‌ బెస్ట్‌’లో విజేతగా నిలిచాడు. తమిళ సంగీత దర్శకుడు వర్షన్‌ సతీష్‌ కుమారుడే లైడియన్‌ నాదస్వరం.

రెండేళ్ల వయసులోనే డ్రమ్స్‌ వాయించడం మొదలుపెట్టాడు లైడియన్‌. నిమిషంలో 325 బీట్స్‌ ప్లే చేసి ఓ షోలో అందర్నీ ఆశ్చర్యపరిచాడీ బుడతడు. ‘బారోజ్‌’ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం గోవాలో జరగనుంది. మలయాళ పరిశ్రమలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే సినిమా ఇదని ప్రచారంలో ఉంది. ఇంత భారీ సినిమాకు ఓ చిన్న బాలుడికి సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే విషయం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top