వైజాగ్‌ బీచ్‌ రోడ్డులో బాలకృష్ణ ధర్నా..!

Balayya Jai Simha shoot At Vizag Beach

నందమూరి బాలకృష్ణ వైజాగ్‌ బీచ్‌రోడ్డులో 5 వేల మందితో కలిసి ధర్నాచేస్తున్నారు. బాలయ్యకు మద్ధతుగా 110 బస్సులు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఇదంతా నిజంగా కాదులెండి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో జై సింహా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్‌ బీచ్‌ రోడ్డులో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు  5 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌ లపై మహాధర్నా సన్నివేశాలను చిత్రీకరించారు.

నిర‍్మాత సి కళ్యాణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. బాలయ్య నటించిన సినిమాల్లో సింహ అనే పేరుతో వచ్చిన సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్‌ అయిన సినిమాలు మంచి విజయాలు సాధించిన  నేపథ్యంలో జై సింహ కూడా ఘనవిజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top