ఎన్టీఆర్ బయోపిక్ హిందీలో కూడా..!

Balakrishnas Ntr Biopic in telugu and hindi

నందమూరి తారకరామారావు జీవితకథ ఆధారంగా ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. దర్శకుడు తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న ఈసినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ రూపొందించనున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.

అయితే ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ రెండు చిత్రాల్లో ఎన్టీఆర్ జీవితాన్ని ఎవరు ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top