నందమూరి అభిమానులకు శుభవార్త..!

Balakrishna Teja Ntr Biopic Teaser - Sakshi

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంచలన దర్శకుడు తేజ దర్శకత్వం వహించనున్నారు. చాలా రోజలు క్రితమే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా, రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వటానికి మరికొద్ది రోజుల సమయం పట్టనుంది. అయితే ఈ లోగా అభిమానుల కోసం ఓ ఆసక్తికరమైన టీజర్ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. బాలయ్య లుక్ ఏమాత్రం రివీల్ కాకుండా ఇంట్రస్టింగ్ కాన్సప్ట్ తో టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇటీవలే ఈ టీజర్ కు సంబంధించిన షూటింగ్ రామకృష్ణ సినీ స్టూడియోస్ లో పూర్తయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయ ప్రచారం కోసం వినియోగించిన చైతన్య రథాన్ని ప్రముఖంగా చూపించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ లుక్ లో ఉన్న బాలయ్యను వెనకనుంచి చూపించి టీజర్ ను ముంగిచాలని భావిస్తున్నారట. అయితే టీజర్ లో డైలాగ్స్ ఏమైనా ఉంటాయా..? లేదా..? తెలియాల్సి ఉంది. ఈ టీజర్ ను ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జనవరి 18న రిలీజ్ చేయనున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top