నెక్ట్స్ బాలయ్యతోనే..!

Balakrishna Next Movie With Vinayak - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సి కళ్యాణ్‌.. ఈ కాంబినేషన్‌లో మరోసారి తెర మీదకు తెచ్చేందుకు ప్లాన్‌ చేశారు. జై సింహా తరువాత వినాయక్‌ సినిమానే సెట్స్‌ మీదకు వస్తుందని భావించినా.. బాలయ్య మాత్రం ఎన్టీఆర్‌ బయోపిక్ పనుల్లో బిజీ అయ్యారు.

దీంతో వినాయక్‌, బాలకృష్ణ ల సినిమా ఆగిపోయినట్టే అన్న టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్యతో చేయబోయే సినిమాకు వినాయక్‌ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘ఎన్టీఆర్’ పూర్తయిన వెంటనే వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు బాలకృష్ణ ఓకె చెప్పారట. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top