బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

Babu Gogineni Questions Bigg Boss Game Spirit - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకి వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు షో నిర్వహణ తీరును తప్పుబట్టడం తెలిసిన సంగతే. బిగ్‌బాస్‌ సీజన్‌-3 నుంచి తొలివారంలోనే ఎలిమినేట్‌ అయిన హేమ కూడా హౌస్‌లో జరిగే అనేక విషయాల్ని బయటకు చూపడం లేదని ఆరోపించారు. తాజాగా బిగ్‌బాస్‌ సీజన్‌-2లో బలమైన కంటెస్టెంట్‌ నిలిచిన బాబు గోగినేని షో నిర్వహణ తీరును ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోతో పాటు పలు ప్రశ్నలను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. 

‘లీక్‌ల కారణంగా బిగ్‌బాస్‌ గేమ్‌ స్పూర్తి  దెబ్బతింటుంది. బిగ్‌బాస్‌ షో నుంచి హేమ ఎలిమినేట్‌ కావడం, వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంటర్‌ కావడానికి సంబంధించిన వార్తలు ముందుగానే బయటకు వచ్చాయి. ఈ లీక్‌లు గేమ్‌ స్పిరిట్‌కు విరుద్దంగా ఉన్నాయి. గత సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు ఈ వార్తలు ప్రచారం చేయడం ఏమిటి?. ఇందులో బిగ్‌బాస్‌ నిర్వాహకుల తప్పుకూడా ఉంది. హైదరాబాద్‌ మధ్యలో అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్‌ హౌస్‌ ఏర్పాటు చేసి.. 400 మంది తెలుగువాళ్లతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. పక్క గల్లిలో పాట కూడా హౌస్‌లోకి వినిపించేలా ఉన్నప్పుడు.. ఒంటరితనం అనే భావన ఎక్కడున్నట్టు?.

బిగ్‌బాస్‌ కోసం పనిచేసే బృందంలో టెక్నిషియన్లు, ఎడిటర్లు, సౌండ్‌ ఆపరేటర్స్‌, డాక్టర్లు, కెమెరామెన్‌లు.. ఇలా చాలా మంది ఉన్నారు. వీరి వద్ద నుంచి బయట ఉన్న వ్యక్తులు సమాచారం సేకరించడం చాలా తెలికైన పని. ముఖ్యంగా వీకెండ్‌ ఎపిసోడ్‌లు షూట్‌ చేసే టెక్నిషియన్లు కొన్ని లీక్‌లను బయటకు వదులుతున్నారు. దీనిని కొన్ని యూట్యూబ్‌ చానళ్లు తాము ఎదో సాధించామన్నట్టుగా ప్రజలకు చేరవేస్తున్నాయి. ఇది మంచి పద్దతి కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. క్రిమినల్‌, సివిల్‌ లా ప్రకారం దీనిపై చర్యలు తీసుకోవచ్చు. హౌస్‌లోకి వెళ్లేవారి గురించి, బయటకు వచ్చేవారి గురించి ముందుగానే లీక్‌లు వస్తుంటే నిర్వాహకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. గతంలో కొందరి కంటెస్టెంట్ల పేరిట అభిమానులు ఆర్మీలుగా ఏర్పడి.. ఇతర హౌస్‌మెట్స్‌పై, స్టార్‌ మాపై, షో నిర్వహకులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి బెదిరింపులు మీరు మళ్లీ ఎదుర్కొవాలని అనుకుంటున్నారా’అని బాబు ప్రశ్నించారు. గత సీజన్‌లో బాబు ఎలిమినేట్‌ అయిన సమయంలో కూడా బిగ్‌బాస్‌ నిర్వహణను తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top