మాటకు మాట... దెబ్బకు దెబ్బ... | 'Autonagar Surya' Releasing On The 31st January | Sakshi
Sakshi News home page

మాటకు మాట... దెబ్బకు దెబ్బ...

Dec 29 2013 1:13 AM | Updated on Sep 2 2017 2:04 AM

మాటకు మాట... దెబ్బకు దెబ్బ...

మాటకు మాట... దెబ్బకు దెబ్బ...

నా పేరు సూర్య.. ఆటోనగర్ సూర్య. నా ప్రపంచంలో మాటకు మాట... దెబ్బకు దెబ్బే సమాధానం. ఇంకా నా క్యాస్ట్ ఏంటో మీకు అర్థం కాలేదు కదూ..

‘‘‘నా పేరు సూర్య.. ఆటోనగర్ సూర్య. నా ప్రపంచంలో మాటకు మాట... దెబ్బకు దెబ్బే సమాధానం. ఇంకా నా క్యాస్ట్ ఏంటో మీకు అర్థం కాలేదు కదూ.. నాది మోటర్ క్యాస్ట్. మనిషి బరువుని, బాధను మోసుకెళ్లే క్యాస్ట్’’... డైలాగ్ పవర్‌ఫుల్‌గా బావుంది కదూ. దేవా కట్టా మంచి దర్శకుడే కాదు, మంచి డైలాగ్ రైటర్ కూడా అని మరోమారు రుజువు చేసేలా ఉందీ డైలాగ్. ఇలాంటి శక్తిమంతమైన డైలాగులు ‘ఆటోనగర్ సూర్య’లో చాలా ఉన్నాయట. 
 
 నటునిగా నాగచైతన్యలోని కొత్తకోణం ఈ సినిమా అని చిత్రం యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ‘తడాఖా’తో మాస్‌కి చేరువైన చైతూ... ఈ సినిమాతో మాస్ ప్రేక్షకుల అభిమాన హీరోగా అవతరించడం ఖాయమని వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఆర్.ఆర్.మూవీమేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జనవరి 31న ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 
 
 అచ్చిరెడ్డి మాట్లాడుతూ -‘‘నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ఇది. ‘ఏమాయచేశావె’ తర్వాత మళ్లీ చైతూ, సమంత కలిసి నటించారు. వారి కెమిస్ట్రీ యువతరాన్ని ఆకట్టుకుంటుంది. అనూప్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్. మా సంస్థల నుంచి వచ్చిన గత చిత్రాలకు మించి ఈ సినిమా ఉంటుంది. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్ నారోజ్, కూర్పు: గౌతంరాజు, కళ: రవీందర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement