సిద్దు పోయి ఆర్య వచ్చే!

Arya May Act In Shankar Indian 2 Movie - Sakshi

‘బొమ్మరిల్లు’ సినిమాతో సిద్దార్థ్‌ తెలుగులో చాలా ఫేమస్‌ అయ్యాడు. అయితే సిద్దార్థ్‌ గతకొన్నేళ్లుగా ఫామ్‌లోకి రాలేకపోతున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గృహం’ మూవీ మంచి విజయాన్నే సాధించినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకోలేకపోయింది. తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్న సిద్దార్థ్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ వచ్చి చేజాయిరిపోయింది.

శంకర్‌, కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘ఇండియన్‌-2’ మూవీలో సిద్దార్థ్‌ను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు ‘వరుడు’ ఫేమ్‌ ఆర్యను ఆ పాత్ర వరించినట్లు తెలుస్తోంది. శంకర్‌ ‘బాయ్స్‌’ సినిమాతో వెలుగులోకి వచ్చిన సిద్దార్థ్‌కు వచ్చినట్టే వచ్చి మంచి చాన్స్‌ మిస్సయిపోయిందని కోలీవుడ్‌ జనాలు అనుకుంటున్నారట. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్‌ స్వరాలను సమకూరుస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top