'ఆర్య చాలా తెలివైన నటుడు' | Arya an intelligent actor, says director Magizh Thirumeni | Sakshi
Sakshi News home page

'ఆర్య చాలా తెలివైన నటుడు'

Jul 28 2014 12:47 PM | Updated on Sep 2 2017 11:01 AM

'ఆర్య చాలా తెలివైన నటుడు'

'ఆర్య చాలా తెలివైన నటుడు'

డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన నటుడు.. ఆర్య.

డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన నటుడు.. ఆర్య. తమిళంలో మంచి జోరుమీదున్న ఆర్య.. చాలా తెలివైన నటుడని దర్శకుడు మగిళ్ తిరుమేని ప్రశంసలు కురిపించాడు. ఆర్యతో కలిసి 'మేగామన్' అనే సినిమా తీస్తున్న తిరుమేని.. తన హీరో ఆర్య సహజంగానే తెలివైనవాడని, కథకు తన అవసరం ఏంటో సులభంగా అర్థం చేసుకుని, అంచనాలకు మించిన పెర్ఫార్మెన్స్ అందిస్తాడని చెప్పాడు. పరిశ్రమలో ఉన్న చాలా తక్కువమంది తెలివైన నటుల్లో ఆర్య ఒకడని, అతడితో సినిమా తీయడం చాలా సులువని అన్నాడు.

'మేగామన్' సినిమాలో ఆర్య నటన చూసి తాను స్టన్నయ్యానని, ఇప్పటివరకు అతడి కెరీర్లో ఇలాంటి నటన ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. ఆర్యకు నిజాయితీ కూడా చాలా ఎక్కువని, పని పట్ల అతడికి అనురక్తి బాగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో హన్సిక సరసన నటించే ఆర్య చాలా సహజంగా, స్టైలిష్గా కనిపిస్తాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement