
'అల్లు అర్జున్ సినిమాలో నటించట్లేదు'
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమాలో ప్రతినాయకుడిగా నటించనున్నట్టు వచ్చిన వార్తలను సీనియర్ నటుడు అర్జున్ తోసిపుచ్చారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమాలో ప్రతినాయకుడిగా నటించనున్నట్టు వచ్చిన వార్తలను సీనియర్ నటుడు అర్జున్ తోసిపుచ్చారు. విలన్ గా చేసే తీరిక లేదని ఆయన తెలిపాడు. 'పస్తుతం హీరోగానే నటిస్తున్నాను. మిగతా పాత్రలు చేయడానికి తనకు సమయం లేదు. కథానాయక పాత్రల్లోనే కొనసాగుతాను. అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా నటించడం లేదు. దీనిపై వార్తలు వదంతులు మాత్రమే' అని అర్జున్ వివరించారు.
హీరో పాత్రలు, డైరెక్షన్ తో సంతోషంగా ఉన్నానని.. ఇలాంటప్పుడు నెగెటివ్ క్యారెక్టర్లు ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. ఆయన రూపొందించిన 'జైహింద్-2' సినిమాను మూడు భాషాల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా త్రివిక్రమన్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో కన్నడ ఉపేంద్రను విలన్ చేయనున్నారని గుసగుసలు విన్పిస్తున్నాయి.