
‘క్షణం, గాయత్రి, రంగస్థలం’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి అనసూయ. ఇప్పుడు ఆమె ‘ఎఫ్ 2’ చిత్రంలో ఓ అతిథి పాత్ర పోషించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మోహరీన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. ‘‘ఎఫ్ 2’ చిత్రంలో అనసూయ అతిథి పాత్ర చేశారు. అలాగే ఓ సాంగ్‌లో కూడా కనిపిస్తారు’’ అని పేర్కొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన అనిల్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు అనసూయ.