గుంటూరు ప్రేమకథ | Anand Deverakonda and Varsha Bollamma team up for Middle Class Melodies | Sakshi
Sakshi News home page

గుంటూరు ప్రేమకథ

Jul 11 2020 1:04 AM | Updated on Jul 11 2020 1:04 AM

Anand Deverakonda and Varsha Bollamma team up for Middle Class Melodies - Sakshi

ఆనంద్‌ దేవరకొండ

‘దొరసాని’ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండ (విజయ్‌ దేవరకొండ తమ్ముడు) హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’. ఈ చిత్రం ద్వారా వినోద్‌ అనంతోజు దర్శకునిగా పరిచయమవుతున్నారు. భవ్య క్రియేష¯Œ ్స పతాకంపై వెనిగళ్ళ ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘గుంటూరు నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది.

గుంటూరు జిల్లా కొలకలూరు ప్రాంతంలో, గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపాం. ఇందులోని పాత్రలన్నీ గుంటూరు యాసలోనే మాట్లాడతాయి. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల సినిమా రిలీజ్‌ వాయిదా వేశాం’’ అన్నారు. ‘‘మామూలు మనుషుల జీవితాల్లో ఉండే సున్నితమైన హాస్యాన్ని ఈ సినిమాలో చూపించాం. మంచి లవ్‌ స్టోరీ కూడా ఉంది’’ అన్నారు వినోద్‌ అనంతోజు. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: స్వీకర్‌ అగస్తి, ఒరిజినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ఆర్‌.హెచ్‌. విక్రమ్, లైన్‌ ప్రొడ్యూసర్‌: నరేష్‌ రెడ్డి పోలసాని, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: అన్నే రవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement