అమితాబ్‌ గొంతులో కన్నడ కస్తూరి | Sakshi
Sakshi News home page

అమితాబ్‌ గొంతులో కన్నడ కస్తూరి

Published Sat, Mar 16 2019 1:18 PM

Amitabh bachchan Voice in Kannada Movie - Sakshi

కర్ణాటక, బొమ్మనహళ్లి: బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబచ్చన్‌ కన్నడ పాట పాడారు. కన్నడ నటుడు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో  కన్నడ నటి పరూల్‌ యాదవ్‌ నటిస్తున్న బటర్‌ ఫ్లై సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఒక క్లబ్‌ సాంగ్‌ను అమితాబ్‌ బచ్చన్‌ చేత పాడించారు. కన్నడ, ఆంగ్ల సాహిత్యంతో మాస్టర్‌ హిరణ్ణ రాసిన ఈ పాటను రాశారు. గాయని విద్యా హోక్స్‌ కూడా అమితాబ్‌తో గొంతు కలిపారు. ఈ పాటను ప్యారిస్‌లో ఒక క్లబ్‌లో నాలుగురోజులు షూటింగ్‌చేసినట్లు చెబుతున్నారు. అమితాబ్‌ 14 ఏళ్ల కిందట అమృత దారే అనే కన్నడ సినిమాలో అతిథి పాత్రను పోషించారు. మళ్లీ ఇప్పుడు శాండల్‌వుడ్‌ తెరపై దర్శనమిస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement