కొన్ని అలా జరిగిపోతాయంతే | Amala Paul in Mahesh Bhatt Web Series | Sakshi
Sakshi News home page

కొన్ని అలా జరిగిపోతాయంతే

Feb 8 2020 8:16 AM | Updated on Feb 8 2020 8:16 AM

Amala Paul in Mahesh Bhatt Web Series - Sakshi

అమలాపాల్‌

సినిమా: ఎన్నో అవాంతరాలను, వివాదాలను ఎదుర్కొని నిలబడ్డ నటి అమలాపాల్‌. నటిగా రంగప్రవేశం, ప్రేమ, పెళ్లి, విడాకులు, మళ్లీ నటన ఇలా అన్నీ చకచకా అమలాపాల్‌ జీవితంలో జరిగిపోయాయి. ప్రస్తుతం అమలాపాల్‌ చాలా బిజీగా ఉంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఆమె నటించిన అదో అంద పరవై పోల చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. లేడీ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాల స్థాయికి ఎదిగిన అమలాపాల్‌ తాజాగా బాలీవుడ్‌కు రెడీ అవుతోంది. ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. అమలాపాల్‌కు అలాంటి అవకాశం ముంగిటవాలింది. దర్శకుడు మహేశ్‌భట్‌ నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌లో అమలాపాల్‌ నాయకిగా నటించనుంది. దీని గురించి అమాలాపాల్‌ స్పందిస్తూ జీవితంలో  కొన్ని  ఆశ్చర్యకరమైన విషయాలు తెలియకుండానే జరిగిపోతాయని అంది. అలాంటిదే బాలీవుడ్‌ దర్శకుడు నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం రావడం అని పేర్కొంది.

మహేశ్‌భట్‌ యూనిట్‌తో అమలాపాల్‌
ఆయన చిత్రాల్లో నటించాలని దక్షిణాది హీరోయిన్లు కలలు కంటారని అంది. ఆయన చిత్రాల్లో కథానాయకి పాత్రలు బలంగానూ, అర్థవంతంగానూ ఉంటూ జీవితంలో గుర్తుండిపోతాయని పేర్కొంది. ఆయన స్కూల్‌లో నేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పింది. ఆయని నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌ను పుషబ్‌దీప్‌ భరద్వాజ్‌  దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పింది. ఆయన చాలా ప్రతిభావంతుడైన దర్శకుడని పేర్కొంది. ఆయన ఇచ్చిన కథను చదివినప్పుడు ఈ వెబ్‌ సిరీస్‌ అద్భుతంగా ఉంటుందని భావించానని తెలిపింది. ఈ వెబ్‌ సిరీస్‌ 1970 కాలానికి చెందిన విజయం కోసం పోరాడే దర్శకుడికి, ఒక స్టార్‌ హీరోయిన్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే ఇతి వృతంతో కూడిందట. హిందీ చిత్రం చిచ్చోర్‌లో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రశంసలు పొంది మహేశ్‌ భట్‌ను ఆకట్టుకున్న తాహీర్‌ ఈ వెబ్‌ సిరీస్‌లో దర్శకుడి పాత్రలోనూ అమలాపాల్‌ స్టార్‌ హీరోయిన్‌గానూ నటించనున్నారు. ఇందులోని సవాల్‌తో కూడిందని అందుకే మూడు నెలల పాటు వేషభాష, హావబావాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ఆ సిరీస్‌ యూనిట్‌ వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం ఈమె ఆడు జీవితం, కడావర్‌ అనే రెండు మలయాళ చిత్రాలతో పాటు తెలుగులో రీమేక్‌ అవుతున్న అసురన్‌ చిత్రంలోనూ నటిస్తోంది. ఘోస్ట్‌ స్టోరిస్‌ అనే హిందీ చిత్రంలోనూ అమలాపాల్‌ బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement