ఫైట్‌తో స్టార్ట్‌!

Allu Arjun-Trivikram Srinivas film titled Alakananda - Sakshi

దాదాపు ఏడాది తర్వాత అల్లు అర్జున్‌ కెమెరా ముందుకు వచ్చారు. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు టైటిల్స్‌గా ‘నాన్న–నేను, అలకనంద’ పేర్లు తెరపైకి వచ్చాయి.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌  బుధవారం మొదలైంది. ఈ సందర్భంగా సెట్‌లో నెలకొన్న సందడితో ఉన్న ఓ చిన్ని వీడియోను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. మొదటి రోజు ఓ ఫైట్‌ సీన్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సత్యరాజ్, టబు, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, మురళిశర్మ, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ,  రాహుల్‌ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పీడీవీ ప్రసాద్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top