ఓన్లీ వన్స్‌ ఫసక్‌..

Allu Arjun Daughter Arha Making Fun With Fasak Dialogue - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటాడో అందరికి తెలిసిందే. పలు సందర్భాల్లో బన్నీ తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ తన కూతురు అర్హతో కలిసి అల్లరి చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. అర్హతో బన్నీ ‘ఫసక్‌’ చెప్పిస్తున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటుంది. తొలుత అర్హ డోంట్‌ సో మెనీ లైక్‌ దిస్‌ అంటే.. ఆ తర్వాత బన్నీ ఓన్లీ వన్స్‌ ఫసక్‌ అని అర్హతో చెప్పిస్తాడు. అర్హ క్యూట్‌ క్యూట్‌గా డైలాగ్‌ చెప్పిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 

కాగా, ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సీనియర్ నటి టబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తుండగా గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top